హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోవెలకుంట్ల నేతలకు మంత్రి దిశానిర్దేశం

NDL: కోవెలకుంట్ల టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రజాదరణ, సేవా దృక్పథం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయాలని అన్నారు. గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.