హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు

అనకాపల్లి: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా సోమవారం నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. చదివి నేర్చుకుందాం.. నాయకత్వాన్ని పెంపొందించుకుందాం అనే అంశం మీద పోటీలు నిర్వహించినట్లు శాఖ గ్రంథాలయ అధికారిణి దమయంతి తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసిన వారి వివరాలను పేర్కొన్నారు.