MBNR జడ్చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు మృతి చెందిన ఘటనపై డీఎస్పీ స్పందించారు. విచారణ అనంతరం యువకుడు స్టేషన్ నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లిన 35 సెకన్లకే కిందపడిపోయినట్లు తెలిపారు. స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందని, యువకుడు కొంత మద్యం సేవించినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటమ్మన్నారు.
తెలంగాణ
PSలో యువకుడి మృతిపై డీఎస్పీ వివరణ


