హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆధ్యాత్మిక సందడి

BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం నిత్య కల్యాణ వేడుకను అర్చకులు వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, ప్రత్యేక ఆరాధన అనంతరం ఉత్సవ మూర్తులను బేడా మండపంలో ప్రతిష్ఠించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య సీతారాముల కల్యాణం జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేడుకను తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందారు.