హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు

ప్రకాశం: మార్కాపురం వ్యవసాయం మార్కెట్ యార్డ్ సమీపంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. దోర్నాల నుంచి మార్కాపురం వైపు వస్తున్న ఆటో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడినట్లుగా స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని 108 వాహనం ద్వారా జిల్లా హాస్పిటల్‌కి తరలించారు.