MDK: పెద్ద శంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం చెట్లను గ్రామానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి ధ్వంసం చేశాడు. ప్రకృతి వనం స్థలం తనదేనని ఆరోపిస్తూ చెట్లను ధ్వంసం చేసినట్లు జనార్దన్ పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు పల్లె ప్రకృతి వనం చెట్లను పరిశీలించారు. సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
బూరుగుపల్లి లో పల్లె ప్రకృతి చెట్లు ధ్వంసం..


