కోనసీమ: కొత్తపేట ద్వితీయ శ్రేణి శాఖ గ్రంథాలయంలో సోమవారం గ్రంథాలయ ఉద్యమకారుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఆర్. రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయాల ఏర్పాటుకు వారు చేసిన కృషి చిరస్మరణీయమని గ్రంథపాలకురాలు కుంచే సునీత పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపేట గ్రంథాలయంలో సంస్మరణ దినోత్సవం


