ELR: చింతలపూడి మండలంలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చింతంపల్లి అటవీ ప్రాంతంలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. జీలుగుమిల్లి నుంచి మందలపల్లి మీదుగా పులి చింతంపల్లి ఫారెస్ట్‌లోకి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. పరిసర గ్రామాల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చింతంపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం


