కోనసీమ: ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నేత గెడ్డం సురేష్ బాబుపై ఆయన సోదరుడు, 80 ఏళ్ల వృద్ధుడు గెడ్డం మోహన్ రావు పోటీకి దిగారు. గతంలో 7 ఏళ్లు సర్పంచ్‌గా, 10 ఏళ్లు ఎంపీటీసీగా మోహన్ రావు పనిచేశారు. ఈ వయసులోనూ గ్రామాభివృద్ధి కోసం ఆయన ఎన్నికల బరిలోకి దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్
సరిపల్లి సర్పంచ్ బరిలో 80 ఏళ్ల వృద్ధుడు


