హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తికి రానున్న రష్మిక మందన్నా

సత్యసాయి: పుట్టపర్తిలో సత్యసాయి శత వర్ష జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించనున్న మహిళా దినోత్సవ వేడుకలకు ప్రముఖ సినీనటి రష్మికా మందన్నా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఈ నెల 19న జరిగే ఈ కార్యక్రమానికి ఆమె హాజరుకానున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.