హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉంగుటూరు భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శోభ

ELR: కార్తీక సోమవారం కావడంతో ఉంగుటూరు భీమేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు, పూజలు చేయించుకుని, కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.