ప్రకాశం: రాచర్ల మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది 11.16 మీటర్లలో ఉన్న నీరు ప్రస్తుతం 41.77 మీటర్లకు పడిపోయింది. 700-800 అడుగులు వేసినా దుమ్మే వస్తోందని రైతులు వాపోతున్నారు. సాగునీరు అందక, పంటలు ఎండిపోతుండటంతో కరవు ఛాయలు కమ్ముకుంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాచర్లలో అడుగంటుతున్న భూగర్భ జలాలు


