హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సంతబొమ్మాళి మండలం పెద్దమర్రిపాడుకు చెందిన కొంకాన రవికుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డుపై నిలిపిన క్రేన్‌ను ఢీకొన్నాడు. అతడిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు.