హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీసత్యసాయి జయంతికి ప్రత్యేక రైళ్లు

సత్యసాయి: పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. శ్రీకాకుళం-యలహంక, యలహంక-విజయవాడ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.