హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస పూజలు

ATP: గుంతకల్లు పట్టణంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి శివాలయంలో కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన పూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. స్వామివారికి వేకువజామున పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో భక్తాదులు కార్తీక దీపాలను వెలిగించి, తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.