హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ మృతి

KDP: కడపకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ డీసీసీ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. రాజకీయ విశ్లేషకునిగా, కవిగా, వక్తగా ఆయన ప్రసిద్ధి. ఆయన మృతి కడప రాజకీయానికి తీరనిలోటని పలువురు పేర్కొన్నారు.