హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విజయవాడకు కేంద్ర మంత్రి

ఎన్టీఆర్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు సాయంత్రం 6:10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రామవరప్పాడు రింగ్, బెంజ్ సర్కిల్, ఎంజీ రోడ్డు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం మీదుగా అంబేద్కర్ కళావేదికకు చేరుకుంటారు. రాత్రి 7.05 గంటలకు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని, 8:20 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.