హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు..!

NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చూపించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలియజేశారు.