ELR: ఆగిరిపల్లి మండలం శోభనాపురంలో ఇద్దరు వ్యక్తులు ఆటోని చోరీ చేశారు. విజయవాడకు చెందిన రంగారావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆగిరిపల్లి వరకు కిరాయికి రావాలని ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కగా..శోభనాపురం వద్దకు రాగానే రంగారావుపై దాడి చేసి ఆటోను చోరీ చేసినట్లు ఎస్సై తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆగిరిపల్లిలో ఆటో చోరీ


