హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన

ప్రకాశం: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కంభం మండలంలోని పెద్దనల్లకాలువ గ్రామంలో ఆదివారం ఎస్ఐ శివకృష్ణారెడ్డి గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.