NDL: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. పుష్కరిణుల్లో పుణ్యస్నానాలు ఆచరించి పార్వతీపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించగా, నవనందుల దర్శనాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
మహానందిలో కార్తీక దీపాల వెలుగులు


