హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

 ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.కోట్లలో మోసం..!

GNTR: మంగళగిరి రూరల్ పరిధిలో 36 మంది నుంచి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్లు వసూలు చేసిన ఘటనలో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. విచారణకు హాజరైన ధరణి కృష్ణ వాంగ్మూలం నమోదు చేశామని, పోలీసులపై ఆమె చేసిన వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బాధితుల ఫిర్యాదులు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.