హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే పార్టీ.. నలుగురు పోటీ.. ఎవరికి మద్దతు!

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోటలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీకి చెందిన నలుగురు నాయకులు సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఎవరూ పోటీ నుంచి వెనక్కి తగ్గకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. పార్టీ ఎవరికి మద్దతు ప్రకటిస్తుందనే అంశంపై గ్రామంలో చర్చ జోరందుకుంది.