హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శివ నామస్మరణతో మారు మ్రోగిన శివాలయాలు

VZM: కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకుని శివ నామస్మరణతో శివాలయాలు మారుమ్రోగాయి. గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులు కిషోర్ శర్మ వేదమంత్రాల నడుమ శివలింగానికి పూజలు నిర్వహించారు. అలాగే శివలింగానికి క్షీరాభిషేకం పంచామృత అభిషేకాలు జరిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయం మేనేజర్ పటిష్ట ఏర్పాటు చేశారు.