అనకాపల్లి: కోటవురట్లలో మహిళలకే రాజ్యాధికారం దక్కే విధంగా రిజర్వేషన్లు దోహదపడ్డాయి. స్థానిక పంచాయతీ పరిధిలో రెండు ఎంపీటీసీలు మహిళలకే దక్కాయి. కోటవురట్ల-1 సెగ్మెంట్ నుంచి ఎస్.లీలావతి, కోటవురట్ల-2 సెగ్మెంట్ నుంచి దాకారపు రామలక్ష్మి ఎన్నికయ్యారు. స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవి కూడా మహిళలకే రిజర్వు అయింది. దీంతో సర్పంచ్ పదవి కూడా మహిళలకే దక్కనుంది.
ఆంధ్రప్రదేశ్
కోటవురట్లలో మహిళలకు రాజ్యాధికారం


