హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా డెల్టా కాలువలకు 2,029 క్యూసెక్కుల నీరు విడుదల

NTR: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి ఆదివారం కృష్ణా డెల్టా సాగునీటి కాలువలకు 2,029 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. తూర్పు ప్రధాన కాలువకు 1,513, పశ్చిమ ప్రధాన కాలువకు 516 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. KE కాలువ ద్వారా ఏలూరుకు 708, KEBకి 605, బందరు కాలువకు 200 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.