హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రెండవ విడత ఎన్నికలకు నోటిఫికేషన్..!

నెల్లూరు జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నోటిఫికేషన్ సోమవారం రిలీజ్ కానున్నది. 14 మండలాల పరిధిలో 297 గ్రామ పంచాయతీలు, 2714 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.