హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దర్శిలో కాలువలో పడిపోయిన కారు

ప్రకాశం: దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో సోమవారం వేకువజామున పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పిన కారు వేగంగా దూసుకెళ్లి ఎన్ఎస్పీ కాలువలో పడిపోయింది. అయితే కాలువలో నీటి ప్రవాహం లేకపోవడం వల్ల కారులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండి మంచు తగ్గాక ప్రయాణాలు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచనలు చేశారు