KRNL: ఆదోని మండలం-1 పరిధిలోని మండగిరి పంచాయతీలో ఎనిమిదేళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ పంచాయతీని ఆదోని మున్సిపాలిటీలో విలీనం చేయాలని నిర్ణయించగా, పన్నుల భారం పెరుగుతుందనే అభ్యంతరాలతో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో విలీనం నిలిచిపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఎనిమిదేళ్లుగా ప్రత్యేక పాలన కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్
మండగిరిలో 8 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు


