హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తొలి సోమవారం.. అమరావతిలో భక్తుల రద్దీ

PLD: పంచారామ క్షేత్రమైన అమరావతిలోని శ్రీ బాల చాముండికా దేవి సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం తొలి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.