హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు భారత్‌కు బ్రిటన్ ప్రిన్స్

బ్రిటన్ ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతులు ఇవాళ భారత్‌కు రానున్నారు. ముంబైలో జరగనున్న ఎర్త్‌షాట్ పురస్కార వేడుకల్లో వీరు పాల్గొననున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం విలియం 2020లో ఈ ప్రత్యేక అవార్డును ప్రారంభించారు. ఎల్లుండి ప్రధాని మోదీని కలిసి వివిధ అంశాలపై చర్చిస్తారు. కాగా, వీరు చివరిసారిగా 2016లో మన దేశంలో పర్యటించారు.