హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి'

ATP: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు పుస్తక ప్రదర్శనను ఘనంగా ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. డిజిటల్ మాధ్యమాల వైపు ఆకర్షితులవుతున్న యువత పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు.