హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో తాత్కాలిక కోనేరు

ATP: తాడిపత్రి శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా ప్రత్యేక కోనేరు ఏర్పాటు చేశారు. పెన్నానదిలో నీరు లేకపోవడంతో భక్తులు కార్తీక దీపాలు వెలిగించేందుకు వీలుగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సహకారంతో దీనిని నిర్మించారు. ఈవో రామాంజనేయులు, ఛైర్మన్ చంద్రమోహన్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు.