హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు నోటిఫికేషన్ విడుదల

AP: ఇవాళ రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో 4,960 గ్రామ పంచాయతీలకు, 49,224 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 29న ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.