హైదరాబాద్: 28°C
క్రీడలు

SRH నుంచి హర్షల్ పటేల్ ఔట్..!

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ బౌలర్ హర్షల్ పటేల్‌ను రూ.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌తో క్యాష్ ట్రేడ్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో జీటీ నుంచి ప్లేయర్ రాకపోయినా SRH పర్స్ మనీ పెరగనుంది. కాగా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో హర్షల్ మొత్తం 151 వికెట్లు తీశాడు.