హైదరాబాద్: 28°C
క్రీడలు

ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన జో రూట్

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో రాహుల్ ద్రవిడ్‌ను(334).. రూట్ (335) వెనక్కి నెట్టాడు. 402 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకుని 7వ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో జయవర్ధనే (440) ప్రథమ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.