ASF: బెజ్జూర్ మండలం చిన్న సిద్దాపూర్ శివారులో ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్న కజ్జకరి నిఖిల్, కార్తీక్ను ఆదివారం అరెస్ట్ చేసినట్లు SI రమేశ్ తెలిపారు. మరో నిందితుడు గుర్లె శ్రీకాంత్ పరారయ్యాడు. వారి వద్ద 4 మొబైల్ ఫోన్లు, 2 బైక్లు, రూ.400 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్న వ్యక్తుల అరెస్ట్


