హైదరాబాద్: 28°C
తెలంగాణ

మలేషియా వెళ్లి జైలుపాలైన తాడ్వాయి వాసి

KMR: మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తాడ్వాయికి చెందిన సురేష్‌ను ఏజెంట్లు మోసం చేశారని భార్య మౌనిక ఆరోపించింది. టూరిస్ట్ వీసాపై వెళ్లిన సురేష్ జైలులో చిక్కుకోగా, విడిపిస్తామని చెప్పి మరో ఇద్దరు రూ.1.70 లక్షలు వసూలు చేశారని భర్త ఆచూకీ తెలియక ఇద్దరు పిల్లలతో ఇబ్బందులు పడుతున్నానని, అధికారులు స్పందించి భర్తను స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంది.