హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమలాయపాలెంలో ఆసుపత్రి నిర్మిస్తాం: మంత్రి

KMM: తిరుమలాయపాలెంలో సుమారు రూ.26.5 కోట్లతో 100 బెడ్ల ఆసుపత్రిని, రూ.46 కోట్లతో ITI కాలేజీని నిర్మిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం తిరుమలాయపాలెంలో ఆయన మాట్లాడుతూ.. సిమెంట్ రోడ్ల నిర్మాణం, విద్యుత్ వైర్ల మార్పు కోసం సుమారు రూ.10 కోట్లు వెచ్చించామన్నారు. ప్రభుత్వం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందన్నారు.