హైదరాబాద్: 28°C
వార్తలు

వాటిలో ఎటువంటి నిజం లేదు: గడ్కరీ

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ వస్తున్న వార్తలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని తెలిపారు. తాను నాగ్‌పూర్‌లోని ట్రస్ట్ బాధ్యతల గురించే మాట్లాడానని, దానిని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. యువతకు బాధ్యతలు అప్పగించాలనడంలో అర్థం తాను తప్పుకోవడం కాదని, తాను ప్రభుత్వం తరపున పని చేస్తూనే ఉంటానన్నారు.