హైదరాబాద్: 28°C
వార్తలు

పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

HNK: నడికూడ మండల కేంద్రంలోని ఎంఆర్‌సీ కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులకు పింఛన్ల పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.