ADB: జైనథ్‌లో గట్టు నారాయణ హత్య కేసును పోలీసులు చేదించినట్లు సీఐ శ్రావణ్ కుమార్ ఆదివారం తెలిపారు. మద్యం మత్తులో జరిగిన గొడవ కారణంగా ఇప్ప ఈశ్వర్, పెరిక తిరుపతి అనే నిందితులు కేబుల్ వైర్‌తో గొంతు బిగించి నారాయణను హత్య చేసినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు శ్రవణ్ కుమార్ వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: జైనథ్ హత్య కేసు ఛేదన.. నిందితుల అరెస్ట్: CI


