హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వదేశీ సాంకేతికతే లక్ష్యం: రక్షణ మంత్రి

HYD: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. నగరంలో ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 36వ వార్షిక సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. స్వదేశీ తనిఖీ పరికరాలను రూపొందించాలని, ఏఐ, రోబోటిక్స్ సాయంతో లోపాలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించాలని సూచించారు.