హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేంద్రియ ఉత్పత్తులపై ఎమ్మెల్యే పరిశీలన

WNP: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులో గ్రామ భారతీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ సంతను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి, ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అన్నారు. గ్రామీణ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించే ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.