హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భారత్ సమ్మిట్ పేరుతో ప్రజాధన వృథా'

ADB: హైదరాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా నిర్వహించిన 'భారత్ సమ్మిట్'పై బీజేపీ నేతలు ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాలికొదిలి ఆర్భాటపు కార్యక్రమాలతో ప్రజాధనం వృథా చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ మండిపడ్డారు.