హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ ఏరియాల్లో డ్రోన్ నిఘా

శ్రీకాకుళం కలెక్టరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండు రోజులుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తుగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం నామినేషన్ కేంద్రాలకు వచ్చి వెళ్లే మేయర్, వార్డు సభ్యులతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లోని జనసంచార దృశ్యాలను పోలీసులు డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు.