హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

E.G: సమిశ్రగూడెం నుంచి నిడదవోలు వెళ్లే మార్గంలో గామన్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వంతెనల మధ్య బైక్‌పై వెళ్తున్న నిడదవోలుకు చెందిన యువకుడు మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.