ELR: SGFI ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో భీమడోలు మండలం సూరప్ప గూడెంకు చెందిన చిన్నారి ధారియా సత్తాచాటింది. అండర్-14 బాలికల విభాగం షూటింగ్ పోటీల్లో పాల్గొని రజత పతకాన్ని సాధించింది. ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్‌లో కోచ్ సుబ్రహ్మణ్యేశ్వరరావు శిక్షణలో ఆమె ఈ ఘనత సాధించగా, సూరప్పగూడెం గ్రామస్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
షూటింగ్లో రజత పతకం సాధించిన చిన్నారి


