హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

BJP నేత ఓవర్‌యాక్షన్

శ్రీకాకుళంలో నామినేషన్ సమయంలో కారును అనుమతించలేదని ఆగ్రహించిన బీజేపీ నేత చల్లా వెంకటేశ్వర రావు ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసుల పైకి కారుతో దూసుకెళ్లారు. ఈ ఘటనలో సీఐతో పాటు ఎస్సైలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.