హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకులో పెరుగుతున్న చలి తీవ్రత

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలి నుంచి ఉపశమనం కోసం స్థానికులు చలిమంటలు వేసుకుంటున్నారు. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకుకు కోల్‌కతా సహా వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్ వద్ద మంచు మధ్య సూర్యోదయాన్ని వీక్షిస్తూ, సంప్రదాయ థింసా నృత్యంలో పాల్గొంటున్నారు.